హైదరాబాద్ మహా నగరం లో మరో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ మహా నగరం లోని కూకట్ పల్లి లో ఓ సాఫ్ట్ వేర్ యువతి సూసైడ్ చేసుకుంది. ఇవాళ ఉదయం పూట ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది ఆ సాఫ్ట్ వేర్ యువతి. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ప్రియాంక మరియు అన్వేష్ అనే జంటకు గతేడాది నవంబరు లో పెళ్లి జరిగింది. వీరుద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.
అయితే కూకట్ పల్లిలోని వివేకానందనగర్ లో పెళ్లి అయినప్పటి నుంచి ప్రియాంక మరియు అన్వేష్ నివాసం ఉంటున్నారు. కూకట్ పల్లి స్వాన్‌లేక్ అపార్ట్‌మెంట్‌లో ఈ సాప్ట్ వేర్ జంట నివాసం ఉంటుంది. అంతే కాదు కరోనా నేపథ్యం లో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు ఈ దంపతులు. ఈ నేపథ్యం లోనే చిన్న చిన్న తగాదాలతో భార్య భర్తల మధ్య గొడవలు వచ్చేవి. అయితే ఈ నేపథ్యం ఇవాళ ఉదయం లేచి చూసే సరికి ప్రియాంక ఉరి వేసుకుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక తండ్రి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రియాంక తండ్రి ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.