‘దిశ రేప్​’ కేసు : సల్మాన్​, రవితేజ, రకుల్​పై కేసు !

-

2019 సంవత్సరం లో హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ హత్య కేసు… దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరో ట్విస్ట్ నెలకొంది. ఈ దిశ అత్యాచారానికి సంబంధించి…. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ లు రవితేజ మరియు రకుల్ ప్రీత్ సింగ్ సహా మరో 38 మంది పై కేసు నమోదైంది.

బాధితురాలి పేరును సోషల్ మీడియాలో బహిర్గతం చేసినందుకుగాను ప్రముఖులను అరెస్టు చేయాలని కోరుతూ ఢిల్లీ తీజ్ హజారీ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది గౌరవ్ గులాటి. అంతేకాదు సెక్షన్ 228 ఏ కింద ప్రముఖుల పై కేసు నమోదు చేయాలని… సబ్జీ మండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గౌరవ్. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్, అభిషేక్ బచ్చన్, సహా టాలీవుడ్ నటులు రవితేజ, చార్మి, అల్లు శిరీష్ పేదలు కూడా ఈ ఫిర్యాదులో గౌరవ్ పేర్కొన్నాడు. అలాగే క్రికెటర్లు హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్ మరియు సైనా నెహ్వాల్ పై కూడా కేసు నమోదు చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారం.. అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version