సూర్యగ్రహణం… 2020లో ఏర్పడుతున్న మొట్టమొదటి సూర్యగ్రహణం. పెద్ద గ్రహణం ఇది. జూన్ 21 ఆదివారం తేదీన అమావాస్, సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని అంగుల్యాకారం దేన్ని చూడామణి నామక సూర్యగ్రహణం అని కూడా అంటారు. ఈ సూర్యగ్రహణం రోజు కొన్ని నియమాలు పాటించడం మంచిది అని పండితులు పేర్కొంటున్నారు.
గ్రహణం పట్టే సమయం, విడుపు సమయం తెలుసుకుందాం…
గ్రహణ సమయం- విశేషాలు
జూన్ 21 ఉదయం 12.08 శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం . మృగశిర -4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది.
గ్రహణ ఆరంభకాలం : ఉ.10.25
గ్రహణ మధ్యకాలం : ఉ.12.08
గ్రహణ అంత్యకాలం : మ . 1.54
గ్రహణ ఆద్యంత పుణ్యకాలం 3 గంటల 29 నిమిషాలుగ్రహణ నియమాలు ఉంటుంది. ఈ సమయంలో నేరుగా ఎవరు కూడా సూర్యుడిని చూడరాదు. నల్ల అద్దాలు, బ్లాక్ ఫిలింలు మందమైనవి లేదా సోలార్ ఫిల్టర్‌లు వాడి సూర్యగ్రహణం చూడాలి లేకుంటే కంటి చూపు పోతుంది. ఈరోజుల్లో మనకు దాదాపు అన్ని టీవీ చానెల్లలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది కాబట్టి దానిలో చూడట మంచిది.
– శ్రీ