మరోసారి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో సూపర్ స్టార్ ..!

-

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే అన్న సినిమాలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా లతో పాటు నయనతార, కీర్తి సురేశ్ కూడా నటిస్తున్నారు. ఇక ఇదే సినిమాని అన్నయ్య పేరుతో తెలుగులోను డబ్బింగ్ చేస్తారు. ఇక ఈ సినిమాని 2021 సంక్రాంతి టార్గెట్ గా మేకింగ్ ప్లాన్ చేసినప్పటికి లాక్ డౌన్ తో సమ్మర్ కి వెళ్ళింది.

 

ఇక తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. కోలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించడానికి రజనీకాంత్ ఒకే చెప్పారట. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో పేట అన్న సినిమా వచ్చింది. భారీ అంచనాల మద్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గ నిలిచింది.

అయినా మరోసారి దర్శకుడి మీద ఉన్న నమ్మకం తో రజనీకాంత్ కార్తీక్ సుబ్బరాజు కి అవకాశం ఇచ్చారట. ఇక గత కొంతకాలంగా రజనీకాంత్ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా మిగులుతున్న సంగతి తెలిసిందే. అయినా తనిళ ఇండస్ట్రీలో రజనీకాంత్ మార్కెట్ మాత్రం నిలకడగా ఉంది. ఇక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన పెంగ్విన్ రీసెంట్ గా అమెజాన్ ప్రైం లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news