బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ జరుగుతుంది. పోలింగ్ ని చాలా జాగ్రత్తగా ఎన్నికల సంఘం, నిర్వహిస్తుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. కరోనా ఉన్నా సరే భయం లేకుండా వృద్దులు యువకులు అందరూ కూడా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుకుంటున్నారు. ఇక సైనికులు కూడా ఇప్పుడు ఓటు వేసే వారికి తమ వంతుగా సహకారం అందిస్తున్నారు.
బీహార్ లోని ఖాగేరియా, సివాన్, సరన్ జిల్లాల్లో మోహరించిన ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐ టి బిపి) జవాన్లు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల రెండవ దశలో పోలింగ్ బూత్‌లలో వికలాంగులైన ఓటర్లకు సహాయం చేస్తున్నారు. వారిని పోలింగ్ బూత్ కి తీసుకుని వెళ్ళడానికి తమ వంతుగా సహాయం చేస్తున్నారు. ఇక 94 స్థానాల్లో నేడు బీహార్ లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.