అమ్మో మేము వర్క్ ఫ్రం హోం ఇవ్వలేం…!

-

అమెరికాలో కరోనా వైరస్ విస్తరించడం ఇప్పుడు భారత్ లో ఐటి రంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అంశం. మన దేశంలో వేలాది మంది ఇప్పటికే తమ జాబ్ ని కోల్పోగా… మరి కొంత మందికి ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి. అంతర్జాతీయ౦గా కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు ఐటి రంగం మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు వస్తున్నాయి.

మన దేశంలో ప్రముఖ కంపెనీలు అన్ని కూడా ఇప్పుడు ఉద్యోగులను తొలగించే అవకాశాలు కనపడుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలు ఇప్పుడు ఐటి కి కీలకంగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భారీగా ఉద్యోగాలు కోల్పోయే సూచనలు ఉన్నాయని… ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్ లు నడుస్తున్న నేపధ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులను కొనసాగిస్తున్నాయని తర్వాత వారిని తప్పించే అవకాశం ఉందని అంటున్నారు.

కీలక కంపెనీలు కూడా ఆర్ధిక నష్టాలను తీవ్రంగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక వర్క్ ఫ్రం హోం ఇవ్వలేక కొన్ని కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పట్లో మెరుగు పడే అవకాశాలు లేవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ప్రభావం తీవ్రంగా పడి మన నుంచి కోట్ల ఉద్యోగాలు ఐటిలో కోల్పోయే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news