జగన్ కీలక నిర్ణయం… రేషన్ సరుకులు ఎలా అంటే…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. దీనితో ప్రభుత్వం పేదలకు ఇచ్చే సరుకుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రజల అందరి ఆకలి తీర్చడానికి సిద్దమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే తొలి విడత సరుకులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రెండో విడత సరుకులు ఇవ్వడానికి సిద్దమవుతుంది. నిత్యావసరాలకు ఏ ఇబ్బంది రాకుండా చూడాలని భావిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకు పైగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చెయ్యాలని భావించింది. మొదటి విడతలో ప్రభుత్వం గత నెల 29 నుంచి బియ్యం కందిపప్పుని పంపిణి చేసింది. ఈనెల 15 నుంచి రెండో విడతలో భాగంగా, కరోనా వ్యాప్తి నేపధ్యంలో రేషన్‌ షాపుల వద్ద రద్దీని నియంత్రించేందుకు గానూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ షాపునకు అనుబంధంగా అవసరాన్ని బట్టి రెండేసి దుకాణాలను, అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుంది.

ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పౌర సరఫరాల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 29,620 వరకు రేషన్‌ షాపులు ఉన్నాయి. అదనపు కౌంటర్లతో ఆ సంఖ్య దాదాపు 80 వేలకు పెరగనున్నాయి. అదనపు కౌంటర్ల కోసం స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, గ్రామ సచివాలయాలను గుర్తిస్తున్నారు. 10 మందికి మించకుండా క్యూలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రెడ్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వాలంటీర్లే ఇంటింటికీ రేషన్‌ను అందిస్తారు. ఈ మేరకు కూపన్లు ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news