అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ నే ఉంటుంది. ఒకవైపు కేరీర్ లో దూసుకెళ్తునే.. మరోవైపు కాంట్రవర్సీలతో నెట్టింట దుమారం రేపుతుంటుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి..
అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది అనసూయ. బుల్లితెరపై తనదైన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకుంది పలు టీవీ షో లతోపాటు సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఇప్పటికీ తన అందంతో రచ్చ చేస్తుంది.. అలాగే జబర్దస్త్ టీవీ షోతో అనసూయకు ఎంతటి క్రేజ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఏ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుందో అదే స్థాయిలో వ్యతిరేకతనూ మూటగట్టుకుంది. టీవీ షోలో విపరితమైన ఎక్స్పోజింగ్తో రెచ్చిపోయి అనసూయ.. సోషల్ మీడియాలో కూడా ఏమాత్రం తగ్గకుండా పోస్టులు పెడుతూ ఉంటుంది అలాగే అప్పుడప్పుడు సంచలన కామెంట్స్ కూడా చేస్తుంది.. అయితే ఎప్పటికప్పుడు తనపై వస్తున్న ట్రోల్స్ ను లైట్ తీసుకొని అనసూయ.. ప్రస్తుతం మాత్రం కేసు పెట్టి మరీ హెచ్చరిస్తోంది. ఇటీవల ఓ వ్యక్తిని అరెస్టు కూడా చేయించిన విషయం తెలిసిందే. ఇలా ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే వస్తోంది. ఈ క్రమంలో అనసూయ మరో షాకింగ్ పోస్ట్ పెట్టింది. తన ఇన్ స్ట్రా గ్రామ్ స్టోరీలో కొందరినీ టార్గెట్ చేస్తూ ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. “సమస్యలను తెచ్చిపెట్టే పాపులకు దూరంగా ఉండాలి..నాకెందుకో కొంతమంది గుర్తుకు వస్తున్నారని.. ” అంటూ చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అనసూయ ఎవరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది.. ఆ కొంతమంది ఎవరనేది రహస్యంగా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ల ద్వారా స్పందిస్తున్నారు. ఎక్కువ శాతం ఆమె పోస్టుకు మద్దతిస్తూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.