Nothing Phone 1 నుంచి సంథింగ్ సమాచారం మీకోసం.. లీకైన ప్రొసెసర్, డిజైన్ అప్‌డేట్స్

-

టెక్ అభిమానులు అంతా ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 1(Nothing Phone 1) గురించి బిగ్ అప్‌డేట్‌ వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ లిస్ట్ అయింది. వన్‌ప్లస్‌ మాజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ (Carl Pei) స్థాపించిన నథింగ్ సంస్థ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌ రానుందని గత నెల ప్రకటన వచ్చింది. విభిన్నమైన డిజైన్ తో ఫోన్ ఉంటుందని కార్ల్ అప్పుడే చెప్పారు. ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం అది నిజం కానుంది. లీకైన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రాసెసర్‌

Nothing Phone (1) Specifications : నథింగ్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ ఉండనుంది.. ఎందుకంటే క్వాల్‌కామ్‌తో నథింగ్ భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది. లాంచ్ ఈవెంట్‌లోనూ ఇదే విషయం స్పష్టం చేశారు. క్వాల్‌కామ్‌ లేటెస్ట్ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ నథింగ్ ఫోన్‌ (1)లో ఉండే అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

డిజైన్ ఇలా..

Nothing Phone (1) Design చాలా విభిన్నంగా ఉంటుందని లాంచ్ ఈవెంట్‌లోనే కార్ల్ చెప్పారు. అందుకు అనుగుణంగా ట్రాన్స్‌ప్రంట్ డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ రానుందనట.. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా లీకయ్యాయి. నథింగ్ నుంచి వచ్చిన తొలి ప్రొడక్ట్ నథింగ్ ఇయర్ (1) టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ కూడా ట్రాన్స్‌ప్రంట్ డిజైన్‌తోనే ఉన్నాయి. ఇప్పుడు నథింగ్ ఫోన్‌ (1) మొబైల్‌ బ్యాక్ ప్యానెల్ కూడా ట్రాన్స్‌ప్రంట్ డిజైన్‌తో రావడం కచ్చితం అనిపిస్తోంది.

సాఫ్ట్‌వేర్

నథింగ్ ఓఎస్‌ (Nothing OS)తో నథింగ్ ఫోన్‌ (1) రానుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆధారంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది.. స్టాక్ ఆండ్రాయిడ్‌కు దగ్గరగా.. అదనపు ఫీచర్లతో ఈ నథింగ్ ఓఎస్ ఉంటుందని సమాచారం. అలాగే థర్డ్ పార్టీ యాప్స్‌, ప్రొడక్టులకు కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తూ.. పలు ప్రత్యేకమైన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
అలాగే నథింగ్ ఫోన్‌ (1)కు నాలుగు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్‌ ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్‌లు వస్తాయని కార్ల్ పీ అంటున్నారు.
ప్రస్తుతానికి ఈ సమాచారం మాత్రమే తెలిసింది.. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో “Coming Soon” అని లిస్ట్ అవడంతో Nothing Phone(1) రానున్న కొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిసింది.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version