మనదేశంలో కుడి వైపు స్టీరింగ్ ఉంటుంది. మనం ఎడమ వైపు కూర్చుని వెళ్లాలి. అదే అమెరికాలో చూసుకున్నట్లయితే స్టీరింగ్ కుడివైపుకి ఉంటుంది కుడివైపుకు మనం వెళ్ళాలి. చాలా సినిమాల్లో కూడా మనం ఈ తేడాని చూసే ఉంటాం. అయితే ఎందుకు అలా స్టీరింగ్ ఉంటుంది అనేది చూస్తే.. వాహనాలు లేనప్పుడు గుర్రాలే వాహనాలకు ఉపయోగించేవారు.
కానీ ఆ తర్వాత వాహనాలు రావడం మొదలయ్యాయి. 1700 వ ఈ సంవత్సరంలో కూడా గుర్రాలుండేవి. గుర్రాల మీద వెళ్ళేటప్పుడు కుడిచేతివాటం ఉపయోగించేవారు. కత్తుల్ని కూడా ఉపయోగించేవారు. ఎడమవైపు ఒరలో ఉన్న కత్తులతో గుర్రం ఎక్కడం అయ్యేది కాదు అందుకని కుడివైపు నుండి గుర్రం ఎక్కేవారు. అందుకే ఎడమవైపు నుండి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు.
మనదేశంలో అందుకే ఎడమవైపు నుండి ప్రయాణం చేస్తారు. అదే సేఫ్ అంటారు కూడా. 1756లో లండన్ బ్రిడ్జిపై రహదారి ఏర్పాటు చేయడంతో అందరికి ఎడమవైపు వెళ్లాలని అన్నారు. దీనితో అదే అలవాటు అయ్యింది. 1915లో హెన్లీ పోర్ట్ కార్లలో ఉండే డ్రైవర్ సీటును ఎడమ వైపు ఉంచాడు. దీంతో అప్పటి నుంచి అందరు కుడివైపుకు ప్రయాణించడం మొదలు పెట్టారు. మన దేశంలో అయితే స్టీరింగ్ కుడి వైపు ఉండి ప్రయాణం మాత్రం ఎడమ వైపుకు చేస్తాం. అదే అమెరికాలో అయితే రివర్స్.