జగన్‌ క్రిస్టియన్ వాది..హిందూ దేవుళ్ల నగలను తాకట్టు పెట్టాడు : సోము వీర్రాజు

-

ఏపీ సీఎం జ‌గ‌న్ పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగన్ పాలనలో వందల హిందూ ఆలయాలను కూల్చేశారని.. ఒక్కరిపై కూడా ఇంతవరకు కేసు పెట్టలేదని మండిప‌డ్డారు. రథం దగ్ధంతో హిందువుల మనసులు దగ్థమయ్యాయని… చర్చి మీద ఎవడో రాళ్లేస్తే.. వెంటనే కేసులు పెట్టారని ప్ర‌శ్నించారు. జగన్ను క్రిస్టియన్ వాది అనాలా..? అసమర్ధుడు అనాలా..? అర్థం కావ‌డంలేద‌ని ఫైర్ అయ్యారు.

ఓ క్రిస్టియ‌న్ అయి ఉండి… హిందువులు దేవుళ్ల నగలను బాండ్లుగా మారుస్తారా..? అని ప్ర‌శ్నించారు. వాటిని కూడా తాకట్టు పెట్టి డబ్బు ఎలా తెచ్చు కుంటార‌ని నిల‌దీశారు. ఏపీలో ప్రభుత్వం కట్టించే చర్చిల నిర్మాణాలు ఆపేయాలని… ఫాదర్లకు డబ్బులు ఇవ్వడం‌పై కోర్టులో పోరాడతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. బీసీ జన గణన పేరుతో జగన్ మోసం చేస్తున్నారని.. ఏపీలో బ్లాక్ మెయిల్ రాజకీయ పార్టీలు పెరిగాయని నిప్పులు చెరిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని మేము కూడా చెప్పామ‌న్నారు. బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేసే వారిని బీజేపీ నడి రోడ్డు మీద నిలబెడుతుందని హెచ్చ‌రించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version