హిందువులు త‌ల‌చుకుంటే..జ‌గ‌న్ స‌ర్కార్ కూలిపోతుంది : సోము వీర్రాజు సంచ‌ల‌నం

బీజేపీ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందువులు త‌ల‌చుకుంటే.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ కుప్ప కూలిపోతుంద‌ని హెచ్చ‌రించారు. హిందువులన్నా, హిందూ ఆలయాలన్నా జగన్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వానికి చులకనగా కనిపిస్తున్నట్లుందని మండిప‌డ్డారు సోము వీర్రాజు. హిందువుల సహనాన్ని పరీక్షించాలని చూస్తున్నట్లుందని మండిప‌ డ్డారు.

ఒక్కసారి హిందువులు తలచుకుంటే తమ ఓటు ద్వారా మీ ప్రభుత్వానికి భవిష్యత్తు లేకుండా చేస్తారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొన్న త్రిపురాంతకంలో అయ్యప్పస్వామి విగ్రహాన్ని తొల గించారు, నేడు గిద్దలూరులో ఏకంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చేశారని మండిప‌డ్డారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు గతంలో దగ్గరుండి చేయించారని నిప్పులు చెరిగారు సోము వీర్రాజు. ఇక పై మీ ప్రభుత్వాన్ని, మీ ఆగడాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అధికారం లోకి వ‌చ్చినప్ప‌టి నుంచి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అడ్డ‌గోలుగా పాలిస్తుంద‌ని నిప్పులు చెరిగారు సోము వీర్రాజు.