తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని, ఓమిక్రాన్ వేరియంట్ గురించి ముఖ్య మంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. రాష్ట్రం లో కరోనా కేసుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ పురోగతి పై సంబంధిత అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. అలాగే రాష్ట్రం లో ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం పై అధికారులతో చర్చించారు. అలాగే ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు గా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో సమీక్షించారు.
కాగ రాష్ట్రం లో కరోనా వైరస్ వ్యాప్తి గానీ ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం కానీ అదుపు లోనే ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు సమిష్టి గా ఓమిక్రాన్ వేరియంట్ కు వ్యతిరేకంగా పని చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి, ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం పై ఎలాటి ఆందోళన చేందాల్సిన అవసరం లేదని అన్నారు. కాగ తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటి వరకు 8 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇంత వరకు లోకల్ గా వచ్చిన కేసులు లేవని సీఎం కేసీఆర్ అన్నారు.