మంచు మోహన్ బాబుని కలిసిన సోము వీర్రాజు

-

సీనియర్ నటుడు మంచిగా మోహన్ బాబుతో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు. మంచు మోహన్ బాబు ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు సోము వీర్రాజు. ఈ సందర్భంగా సోము వీర్రాజును సత్కరించారు మోహన్ బాబు. మోహన్ బాబు – సోము వీర్రాజు మధ్య గంటపాటు ఏకాంతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

అయితే వీరిరువురిది మర్యాదపూర్వక భేటీ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోము వీర్రాజు మోహన్ బాబు ని కలిసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సోము వీర్రాజు మోహన్ బాబును కోరినట్లు సమాచారం. అయితే ఈ భేటీలో వీరిద్దరూ ఏ అంశంపై చర్చించుకున్నారు అనే దాని గురించి స్పష్టత రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version