వెంకన్న ఏమైనా కొడాలి నానికి బావమరిదా ?

-

ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు మంత్రి కొడాలి నాని మీద కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ మత విశ్వాసాలను దెబ్బ తీసేలా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చేశారని, హిందువులను రెచ్చగొట్టేలా ఆయన మాటలు ఉన్నాయని సోము పేర్కొన్నారు. హిందూ దేవతా మూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న వెంకన్న ఏమైనా నానికి బావమరిదా… డిక్లరేషన్ ఎవరు పెట్టారు అంటారా అని ప్రశ్నించారు. ఆంజనేయ స్వామి చేయి విరగ్గొడితే ఆయనకు నష్టమా ? రధం దగ్ధం అయితే… కోటి రూపాయలతో‌ చేపిస్తున్నారు ! ఇలాంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం అయ్యాయని ఆయన అన్నారు.

రాజ్యాంగ పదవిలో ఉండి.. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని మంత్రి వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని వీర్రాజు డిమాండ్ చేశారు. వెంకన్నకు ఎన్నో సేవలు చేస్తాం… వాటిని కూడా ప్రశ్నిస్తారా ? డిక్లరేషన్ తో ఆటు అనేక ఆచారాలను విస్వాసంతో అమలు‌ చేస్తున్నామని ఆయన అన్నారు.
ఆ కార్యక్రమాలు పెట్టిన వారే… డిక్లరేషన్ కూడా పెట్టారు… వెంకటేశ్వరరావు గారూ, ఎంతో కాలంగా వస్తున్న ఆచార వ్యవహరాల ను కూడా మార్చే స్తారా అని ఆయన ప్రశ్నించారు. ఆంజనేయ స్వామి విగ్రహం చేయి పగులకొడితే.. బొమ్మ చేయి అంటారా ? ఇటువంటి వ్యాఖ్యలు ను బట్టి మాకు అనేక అనుమానాలు కలుగుతున్నాయన్న ఆయన ఇప్పటికైనా సిఎం స్పందించి హిందూ ఆలయాలకు రక్షణ కల్పించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news