ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత వారం రోజులుగా ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమస్యలపై జన సేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ సర్కార్ పై పోరాటం చేస్తుంటే.. తాజాగా కేంద్రానికి ఏపీ బిజేపి లేఖ రాసింది. రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. విభజన తర్వాత ఏపీ లోని మాజీ సైనికుల పెండింగ్ సమస్యల ను రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ దృష్టి కి తీసుకెళ్ళారు సోము వీర్రాజు.
ఆర్మీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌ను విజయవాడ లో ఏర్పాటు చేయాలని లేఖలో సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరి గా ఏపీ లో కూడా మాజీ సైనికుల వాహనాలకు టోల్ గేట్ రాయితీ వర్తింప చేయాలని పేర్కొన్నారు. మిలట్రీ డిస్పెన్సరీ లలో ఫార్మశీ సౌకర్యం మెరుగు పర్చాలని కోరారు సోము వీర్రాజు. అలాగే కృష్ణా జిల్లా కలెక్టరు కూడా లేఖ రాశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. విజయవాడలో సైనిక అమరవీరుల స్థూపం కట్టాలని కోరారు సోము వీర్రాజు. 2008 లోనే ఓ సైనికునికి 175 గజాల స్థలాన్ని కేటాయిస్తూ ఇచ్చిన జీవోను అమలు చేయాలని లేఖలో విన్నవించారు సోము వీర్రాజు.