టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఫ్యామిలీపై కేసు

-

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ కు ఊహించని షాక్ తగిలింది. భూ ఆక్రమణ కేసులో భాగంగా… తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ తో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు అయింది. చిత్తూరు జిల్లాలో గల్లా జయదేవ్ కుటుంబీకుల భూ ఆక్రమణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గల్లా అరుణ కుమారి తో పాటు ఆమె కుమారుడు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్, గల్లా రామచంద్ర నాయుడు తో సహా 12 మంది మీద కేసు నమోదయింది.

చిత్తూరు జిల్లా తవణం పల్లి మండలం దిగువ మాగం లో గల్లా అరుణకుమారి తండ్రి పేరు మీద రాజన్న ట్రస్టు ఏర్పాటు చేశారు. ఇందుకోసం పెద్ద భవనాలు నిర్మించారు. అయితే భవనాల నిర్మాణం సందర్భంగా ప్రభుత్వ భూములను ఆక్రమించారు. దీనిపై స్థానిక రైతులు తిరుగుబాటు చేశారు.

గోపి కృష్ణ అనే రైతు ఏకంగా 2015 లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో గోపి కృష్ణ తో పాటు మరికొంతమంది రైతులు కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు గల్లా అరుణకుమారి తోపాటు టిడిపి ఎంపి గల్లా జయదేవ్, రామచంద్ర నాయుడు తో పాటు 12 మీద తవణంపల్లి పీఎస్ లో కేసు నమోదు అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news