కట్నం ఇవ్వని అత్తమామలు.. అల్లుడు ఏం చేశాడో తెలుసా..!

Join Our COmmunity

ఈ మధ్యకాలంలో చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయి అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. ఏకంగా అత్తమామలు పెళ్లి సమయంలో ఇస్తానన్న కట్నం ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన అల్లుడు కఠిన నిర్ణయం తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

కొండపాక మండలం హనుమాన్ నగర్ కు చెందిన మల్లేశం అనే వ్యక్తి పదేళ్ల క్రితం అంజలి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్ళి జరిగిన సమయంలో ఒక ఎకరా భూమిని మల్లేశం కు కట్నం కింద ఇస్తామని అత్తమామలు హామీ ఇచ్చారు. ఆ తర్వాత అత్తమామలకు ఇదే విషయంపై మల్లేశం అడుగుతూ వచ్చారు ఇటీవలే మరో సారి అత్తమామలను తనకు కట్నంగా ఇస్తాము అని చెప్పిన భూమిని ఇవ్వాలి అంటూ అడుగగా అత్తమామలు మాత్రం ఇచ్చేందుకు నిరాకరించటంతో మనస్తాపం చెందిన మల్లేశం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news