మొత్తం చేతులెత్తేసారు.. అందుకే ఓడిపోయాం..!

Join Our COmmunity

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే సిరీస్ లో టీమిండియా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. ఓవైపు బౌలింగ్ విభాగంలో మరోవైపు బ్యాటింగ్ విభాగంలో విఫలం కావడమే కాదు ఫీల్డింగ్ లో కూడా ఎంతో కీలకమైన క్యాచ్లు వదిలేసి భారీ మూల్యం చెల్లించుకుంది టీమిండియా. అంతేకాదు ఆస్ట్రేలియా భారత జట్టు ముందు ఉంచిన పరుగులు చేధించలేక చివరికి ఓటమి చవిచూసింది.

సిడ్నీలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఓటమి పై ఇటీవలే భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిన్న భారత జట్టు ఫీల్డింగ్ లో పేలవ ప్రదర్శన చేసింది అంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియా ఫీల్డర్లు అందరూ కూడా చేతులెత్తేయడంతో ఎంతో అలవోకగా ఆస్ట్రేలియా గెలిచింది అంటూ వ్యాఖ్యానించాడు. ప్రతి క్యాచ్ ఎంతో కీలకమని కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో ఎన్నో కీలకమైన క్యాచ్లు వదిలేయడంతో టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు హర్భజన్ సింగ్.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news