నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో తల్లి కళ్ల ఎదుటే కుమారుడు ఆక్సిజన్ అందక తుది శ్వాస విడిచాడు. మాడుగులపల్లి మండలం సల్కునూర్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి కోవిడ్ వార్డులో శనివారం చేరాడు. అయితే అప్పటికే పరిస్థితి విషమించిందని వైద్య చేయడానికి డాక్టర్లు ముందుకు రాలేదు. అంతేగాక, ఈ ఆస్పత్రిలో వెంటిలేటర్ సౌకర్యం కూడా లేకపోవడంతో బాధితుడు ఊపిరి తీసుకోలేక తల్లి చూస్తుండగానే ఆమె చేతిలోనే ప్రాణాలు వదిలాడు.
Here is a mother desperately trying to help her son breathe.
He is from from Salkunoor, Madugapalli mandal, Nalgonda district was admitted at the district #COVID19 hospital in morning and samples were collected for the test. Nd he lost his life by evening. pic.twitter.com/sw6Za8YDF4
— Sunil Chowdary (@sunilchowdary84) July 19, 2020
డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా తన కొడుకు చనిపోయాడని ఆ తల్లి ఆరోపించారు. కొడుకు మృతితో కన్నీరుమున్నీరుగా విలిపించింది ఆ మాతృమూర్తి. అయితే ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. మీడియాలో వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరించింది. దీనిపై ఆగస్టు 21లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను హెచ్ఆర్సీ ఆదేశించింది.