చనిపోయిన వారి అస్థికలను గంగలో కలిపితే పుణ్యం వస్తుందని భారతీయుల నమ్మకం. కానీ యూకేలోని కావెంట్రీకి చెందిన ఓ వ్యక్తి తన తండ్రి అస్థికలను, వెంట్రుకలు బీరులో కలిపాడు. అంతటితో ఆగలేదు అతడు ఆ బీరును తీసుకెళ్లి డ్రైనేజీలో పోశాడు. వింటుంటే ఇతడికేమైనా పిచ్చా లేకా సైకోనా అనిపిస్తుంది కదా.. కానీ ఇలా చేయటం వెనుకు గట్టి కారణమే ఉందట.. అది తెలిస్తే మీరు కూడా షాక్‌కి గురవుతారు. ఏంటా అనుకుంటున్నారా.. అయితే ఇది పూర్తిగా చదివేయండి.
కెవిన్ మెక్‌గ్లించే అనే వ్యక్తి చనిపోతూ తన కొడుకును వింత కోరిక కోరాడు. తాను మరణించిన అనంతరం ఆస్థికలను తనకు ఎంతో ఇష్టమైన హోలీబుష్ పబ్‌కు తీసుకెళ్లాలని, బీరులో వాటిని కలిపాలని కుమారుడికి చెప్పాడట. దీంతో కెవిన్ పుట్టిన రోజున కొడుకు ఒవెన్, కూతురు కాస్సిడేలు కలిసి ఆ పబ్‌కు వెళ్లారు. ఒక బీరు ఆర్డర్ చెప్పారు. ఆ తర్వాత ఆ బీరును పబ్ ముందున్న డ్రైనేజీలో కలిపారు. ఓవెన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇది కొంచెం పిచ్చిగానే అనిపిస్తుంది. కానీ ఇది నా తండ్రి ఆఖరి కోరిక. ఆయన ఎప్పటికీ ఇక్కడే ఉంటారు. ఆయన ఎప్పుడూ తన అస్థికలను పబ్ డ్రైనేజీలోనే కలపాలని కోరేవాడు. అందుకే ఇలా చేశాను అని చెప్పాడు.
కెవిన్ మరో వింత కోరిక కూడా కోరాడు. చనిపోయిన తర్వాత తన తల వెంటుకలను కూడా పబ్ డ్రైనేజీలో కలపాలని తెలిపాడు. అతడు చెప్పినట్లే అతడి కొడుకు, కూతురు అస్థికలతోపాటు అవి కూడా కలిపామన్నారు. తన తండ్రికి ఆ పబ్ అంటే చాలా ఇష్టం కావటంతో ఎప్పుడూ అక్కడ ఉండేవాడట. అందుకే చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఉండాలనే ఆశతో ఇలాంటి కోరిక కోరినట్లు కుమారుడు తెలిపాడు. ఇలాంటి వింత కోరికలు కూడా ఉంటాయా అని ఆశ్యర్య పోతున్నారు కదూ.. చనిపోయిన వారి ఆత్మ శాంతిని చేకూర్చాలనుకుంటే వారి ఆఖరి కోరికను తీర్చక తప్పదు కదా.