బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా..బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ పిక్చర్ తో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది.
బాలీవుడ్ చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న సోనాక్షి సిన్హా..సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది ఈ సుందరి.
తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో దిగిన ఫొటోలు షేర్ చేసింది. పెసరు రంగు చీరలో స్లీవ్ లెస్ జాకెట్ ధరించి అలా లైమ్ లైట్ లోకి వచ్చింది. అలా నడుము పై చేయి వాల్చి, చేతిలోకి కొంగును తీసుకుని ఓరగా చూస్తూ రకరకాల స్టిల్స్ ఇచ్చింది సోనాక్షి సిన్హా.
‘శారీ ఫర్ స్టీలింగ్ ద స్పాట్ లైట్’ అనే క్యాప్షన్ తో సోనాక్షి షేర్ చేసిన ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘సో నైస్, సోనాక్షి బ్యూటిఫుల్, ఫైర్, వెరీ నైస్’’ అని కామెంట్స్ చేస్తున్నారు. సోనాక్షి ఇటీవల ‘కకుడ, డబుల్ ఎక్స్ఎల్’సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసింది. త్వరలో ఆ చిత్రాల విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.