ఈ క్షణం కోసమే ఎదురుచూశా : సోనియా గాంధీ

-

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాల్లో 9వేల మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రముఖులు ఓటేశారు.
దేశంలో 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష  ఎన్నిక బరిలో సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ నిలిచారు. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబం కాకుండా ఇతర వ్యక్తి ఏఐసీసీ పగ్గాలు చేపట్టనున్నారు.
దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ‍్యక్షురాలు సోనియాగాంధీ ఓటేశారు. ప్రియాంకా గాంధీతో కలిసి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ క్షణం కోసం తాను చాలా రోజులుగా ఎదురుచూస్తున్నట్లు సోనియా గాంధీ పేర్కొన్నారు. బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news