మనిషి జీవితంలో పెళ్లి అనేది చాలా ప్రత్యేకమైన రోజు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య జంట ఒకటవుతారు. అందరూ ఒకే చోట చేరి నవ వధువరులను ఆశీర్వదిస్తారు. పెళ్లి అనేది ఒక కుటుంబంలో పెద్ద విషయం. ఎన్నో ఎక్స్‌పర్టెషన్స్, కలలు, ఎంజాయ్‌మెంట్, బాధ్యత, ప్రేమకు నిదర్శనాలుగా నిలబడుతుంది. కుటుంబసభ్యుల మధ్య వధువరులు ఒక్కటయ్యే అద్భుత క్షణం అది. అయితే అలాంటి ఒక పెళ్లిల్లో సంతోషం ఒక వేపు ఉంటే.. దుఃఖం మరో వైపు ఉంటుంది. పెళ్లి జరగాలని కొందరు ఆలోచిస్తే.. దీన్ని ఎలా చెడగొట్టాలని ప్రయత్నించే వారూ ఉంటారు. అయితే ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు తల్లి మాట్లాడిన మాటలు.. అక్కడున్న ప్రజలను ఒక్కసారిగా షాక్‌కి గురి చేశాయి. ఈ విషయాన్ని తన కోడలు లేటర్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందనేగా మీ ప్రశ్న.. అయితే అసలు విషయం తెలుసుకుందాం.
ప్రస్తుతం కోవిడ్ కారణంగా అతి తక్కువ మంది సభ్యుల నడుమ ఓ 24 ఏళ్ల యువతి వివాహం జరిగింది. ఆమె ఇలా మాట్లాడుతూ..‘‘ మా పెళ్లి రిసెప్షన్ చాలా సింపుల్‌గా జరిగింది. సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాం. పెళ్లి వేడుకల్లో వధువరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. పెళ్లి వేడుక ముగిసింది. అప్పుడు ఇంటి సభ్యులు చిన్నపాటి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ రిసెప్షన్‌లో ప్రతి ఒక్కరూ తమకు జరిగిన విషయాలు, నవ వధువరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంతలో మా అత్తగారు స్టేజీపై ఎక్కారు. ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఒక్కసారిగా షాకింగ్‌కు గురి చేశాయి. ఆమె.. ఈ సందర్భంగా మీ అందరికీ మరో శుభవార్త చెప్పాలని అనుకుంటున్నాను. నేను మరోసారి తల్లి కాబోతున్నానని ఆమె చెప్పారు.’’ అని వధువు పేర్కొంది.
‘‘పెళ్లిలో ఆమె మాట్లాడిన మాటలకు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యం. రిసెప్షన్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. పెళ్లికూతురు, కొడుకు గురించి మాట్లాడుతుందని భావించాం. కానీ అలా మాట్లాడే సరికి ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. అయితే, మా అత్తమ్మకు చిన్న వయసు ఉంది. అలాగే ఆరోగ్యంగానే ఉంటుంది. నిజానికి మేం రిసెప్షన్‌లో మంచి శుభవార్త చెప్పాలని అనుకున్నాం. వాస్తవానికి నేను పెళ్లికి ముందే గర్భవతిని అయ్యాను. ఈ విషయాన్ని మేమిద్దరం (వధువరులు) స్టేజ్‌పైకి వెళ్లి చెప్పాలనుకున్నాం. కానీ ఇంతలో మా అత్త తను గర్భవతినని చెప్పడంతో మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. పెళ్లిలో అందరూ వింతగా చూశారు. కొద్ది రోజులపాటు మా అత్తతో మాట్లాడలేదు.’’ అని వధువు చెప్పింది.
‘‘నా పెళ్లి మొత్తం నాశనం అయినట్లు అనిపించింది. ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో ఉన్న నాకు మొత్తం నిరాశే మిగిలింది. అయితే పెళ్లి తంతు ముగిసిన తర్వాత మా అత్తగారి చెల్లెలు నాకు కాల్ చేసింది. పెళ్లిలో జరిగిన విషయాన్ని సవివరంగా తెలిపింది. దీంతో నాకూ మొత్తం తెలిసింది. అప్పుడు అర్థం చేసుకుని నేను నా భర్త వారికి అండగా నిలబడ్డాం.’’ అని ఆమె తెలిపింది.