మ‌రోసారి రియ‌ల్ హీరో అనిపించుకున్న సోనూ….నెల్లూరు వరద బాధితులకు భారీసాయం…!

-

రియ‌ల్ హీరో సొనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో వరద బాధితుల కష్టాలపై సోనూసూద్ స్పందించారు. సూద్ చారిటీ ఫౌండేషన్ తరఫున సుమారు రెండువేల బాధిత కుటుంబాలకు తక్షణ అవసరాలు తీర్చేందుకు ఆయ‌న కిట్లను పంపించారు. ఒక్కొక్క కిట్‌లో బకెట్, మగ్గు, చాప, దుప్పట్లు నిత్యవసర సరుకులు ఉన్నాయి. సోమవారం నుండి బాధిత కుటుంబాలకు ఈ కిట్లను పంపిణీ చేసేందుకు సోనుసూద్ ఫౌండషన్ వాలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

sonu sood helps nellore floods
sonu sood helps nellore floods

ఇదిలా ఉండ‌గా సోనూసూద్ తెలుగువారి కోసం ఎన్నో సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఏపీలోని ఓ కుంటుంబాకి ఆయ‌న ట్రాక్ట‌ర్ ను అంద‌జేశారు. అంతే కాకుండా ఏపీలో ఆక్సీజ‌న్ బ్యాంకును సైతం ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా వ‌ర‌ద బాధితుల‌కు అండగా నిలిచి మ‌రోసారి త‌న గొప్ప‌మ‌న‌సు చాటుకున్నారు. ఇక క‌రోనా వేళ సోనూ సూద్ చేసిన సేవా కార్య‌క్ర‌మాల‌ను గురించి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news