థానే వచ్చిన దక్షిణాఫ్రికా ప్రయాణికుడికి పాజిటివ్.. ఒమైక్రాన్‌‌ వేరియంట్‌గా అనుమానం

-

దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు తిరిగి వచ్చిన ప్రయాణికుడికి కరోనా టెస్టు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కల్యాణ్-డోంబివాలి మున్సిపల్ కార్పోరేషన్(కేడీఎంసీ) అధికారులు తెలిపారు. అతనికి సోకిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమైక్రానేనా కాదా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ నెల సౌతాఫ్రికాలో బయటపడ్డ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ అత్యంత ప్రమాదకరమైందన్న అంచనాల నేపథ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ నెల 24 సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ నుంచి థానే జిల్లా డోంబివాలికి ఆ వ్యక్తి వచ్చాడు. కొత్త వేరియంట్ భయాందోళనల నేపథ్యంలో కొవిడ్ టెస్టు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరినీ కలువలేదని మెడికల్ ఆఫీసర్ ప్రతిభ పాన్పాటిల్ తెలిపారు. ఆ పేషెంట్ ప్రస్తుతం కల్యాణ్-డోంబివాలి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఆర్ట్ గ్యాలరీ ఐసోలేషన్ సెంటర్‌లో ఉన్నాడు. కేడీఎంపీ హెల్త్ డిపార్ట్‌మెంట్ అలర్ట్‌గా ఉన్నదని, కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లు ప్రతిభ పాన్పాటిల్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news