వలస కార్మికుల కోసం సోనూసూద్ కొత్త యాప్ ‘ప్రవాసీ రోజ్‌గార్’…!

-

వలస కార్మికులు ఉపాధి అవకాశాలు వెతుక్కునేందుకు తాజాగా ‘ప్రవాసీ రోజ్‌గార్’‌ అనే ఉచిత ఆన్లైన్ ప్లాట్​ఫామ్​ యాప్ ​ను ఆవిష్కరించారు నటుడు సోనూసూద్​. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సరైన ఉద్యోగావకాశాలు వెతకడంలో ఈ యాప్ బాగా ఉపయోగపడుతుందని తెలిపాడు. కోవిడ్ 19 కారణంగా ఇరుక్కుపోయిన వలస కూలీలను సొంతూళ్లకు చేర్చడంలో ఎంతో సకరించిన ఆయన తాజాగా వారికి మరో సాయం చేయడానికి ముందుకొచ్చారు. వలస కార్మికులకు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు ఎదురుకొంటున్న వారికోసం ఓ కొత్త యాప్ ‌ను ఆయన ఆవిష్కరించారు. ఇక ఈ యాప్ ను ‘ప్రవాసీ రోజ్‌గార్’‌ పేరుతో ఉచిత ఆన్లైన్‌ ప్లాట్‌ ఫామ్‌ ను విడుదల చేశారు.

sonu-sood
sonu-sood

దింతో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సరైన ఉద్యోగావకాశాలు కనుగొనడానికి సహకారం అందిస్తుంది. ఆటోమొబైల్​, ఈ-కామర్స్​, ఇంజినీరింగ్, బీపీఓ​, నిర్మాణం, ఆరోగ్యం ఇలా వివిధ ఉద్యోగ అవకాశాల సమాచారం ఇందులో లభిస్తుంది. ఇక ఇందులో ఇంగ్లీష్‌ సహా ఉద్యోగ శిక్షణ నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇందులో అందుబాటులో ఉంచారు. తన అనుభవాలాను అక్షర రూపాన్ని ఇచ్చి ‘లైఫ్​ ఛేంజింగ్’​ పేరిట పుస్తకం రాయనున్నట్లు ఆయన ఇటీవలే తెలిపిన విష్యం అందిరికి తెలిసిందే. ఇక ఈ పుస్తకాన్ని గ్విన్​ ర్యాండమ్​ హౌస్​ ఇండియా ప్రచురించనుందని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news