150 మంది అతిథులతో రామమందిరం భూమిపూజ..!

-

ఆగస్టు 5న అయోధ్యలో నిర్మించబోతున్న రామమందిర నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఎక్కువమందిని ఆహ్వానించ కూడదన్న నేపథ్యంలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమానికి కేవలం 150మంది అతిథులతో తో పాటు 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ట్రస్ట్ తెలిపింది.

sri rama mandhir
sri rama mandhir

ఇందుకోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నట్లు ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవగిరి నేడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా భూమి పూజకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరం లోని రాముడికి పూజ చేయనున్నారు. ఆ తర్వాత హనుమాన్ గిరి ఆలయంలోని హనుమంతుని పూజ లో పాల్గొన్నారు. దశాబ్దాల కాలం నుండి రామమందిరం నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఉండగా మోదీ ప్రభుత్వ హయాంలో ఈ సమస్యకు పరిష్కారాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ, ముస్లింలకు అయోధ్య లోనే మసీదు నిర్మాణానికి మరోచోట స్థలాన్ని ఇవ్వడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news