రాయ్ బలేరిలో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా బిగ్ ట్విస్ట్ ఇచ్చారనే చెప్పాలి. అమేథి నుంచి పోటీకి నిరాసక్తి కనబరస్తూ వచ్చిన ఆయన.. చివరికీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవ్వడంతో పాటు తాజాగా నామినేషన్ కూడా దాఖలు చేశారు రాహుల్ గాంధీ. తన నామినేషన్ పత్రాలను ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రాహుల్ గాంధీ వెంట తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, ఖర్గే, రాబర్ట్ వాద్రా ఉన్నారు. మరోవైపు అమేథిలో కే.ఎల్.శర్మ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కోరారు.

1952లో రాయ్ బరేలీ లోక్ సభ స్థానానికి జరిగిన తొలి ఎన్నికల్లో.. 1957లో జరిగిన ఎన్నికల్లో కూడా ఫిరోజ్ గాంధీ ఎంపీగా నెగ్గారు. దాదాపు దశాబ్దం గ్యాప్ తరువాత ఆయన సతీమణి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వరుసగా రెండు పర్యాయాలు నెగ్గారు. 1977 లో జనతా పార్టీ తరపున రాజ్ నారాయణ్ గెలుపొందారు. 1980లో కూడా వారే గెలిచారు. అరుణ్ నెహ్రు, షీలా కౌల్ కాంగ్రెస్ తరపున రెండు సార్లు ఎంపీగా నెగ్గారు. 1996-98 అశోక్ సింగ్ బీజేపీ ఎంపీగా గెలిచి కాంగ్రెస్ గెలుపునకు రికార్డు కి బ్రేకులు వేశారు. 1999లో కాంగ్రెస్.. 2004 నుంచి రాజ్ బలేరి నుంచి సోనియాగాంధీ ఐదు పర్యాయాల విజయం సాధిస్తూ వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news