నేడు ఇంద్రకీలాద్రికి సోనూ సూద్..!

రియల్ హీరో సోనూ సూద్ నేడు ఏపీ కి రాబోతున్నారు. సోనూ సూద్ ఓ ప్రైవేట్ కార్యక్రమం లో పాల్గొనేందుకు సోనూ విజయవాడ కు వస్తున్నారు. మద్యానం 3:30 నిమిషాలకు సోనూసూద్ విజయవాడ కు చేరబోతున్నట్టు సమాచారం. అంతే కాకుండా సోనూ సూద్ విజయవాడ లో ఇంద్రకీలాద్రి పై కనకందుర్గమ్మ ను దర్శించుకునే అవకాశం ఉంది. రాత్రి 9 గంటలకు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.

sonu sood
sonu sood

ఇదిలా ఉంటే సోనూ సూద్ తన సేవా కార్యక్రమాలతో తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోయారు. దేశం లోని అనేక ప్రాంతాల్లో సోనూ సూద్ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే తెలుగులో సోనూ సినిమాలలో నటించడం ఎంతో గుర్తింపు సాధించడం తో ఆయన తెలుగు వారికి మరింత దగ్గరయ్యారు. ఇక సోనూ సూద్ ఏపి, తెలంగాణ లో ఆక్సిజన్ ప్లాంట్ లను కూడా ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.