తన చిన్నారి గుండె ఆపరేషన్ కి సహాయం చేయాలని ఆసిఫ్ అనే వ్యక్తి షేర్ చేసిన పోస్ట్ కు ప్రముఖ నటుడు సోనూ సూద్ స్పందించారు. ప్రియమైన మామ్, సర్. నాకు నెలల చిన్న పాప ఉంది. ఆ పాపకు ఉన్న సమస్యను నేను మీతో పంచుకుంటున్నా. గుండె జబ్బుతో బాధ పడుతున్న నా అమ్మాయికి గుండెకు రెండు రంద్రాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. శిశువుకి శస్త్ర చికిత్స చేయమని డాక్టర్ నాకు సలహా ఇచ్చారు.
నేను ఖర్చులను భరించలేను నాకు సహాయం చేయండి అని సోను సూద్ కి రిక్వస్ట్ చేసాడు. దీనికి స్పందించిన సోను సూద్… ఆషిఫ్ భాయ్ .. వచ్చే వారం ముంబైలో శస్త్ర చికిత్సను చేయించేద్దాం. చిన్నారిని సూపర్ ఫిట్ గా మార్చేద్దాం. మీ ప్రయాణ వివరాలకు సంబంధించి నా బృందం మీతో కనెక్ట్ అవుతుంది. త్వరలో కలుద్దాం. అని సోను సూద్ రిప్లై ఇచ్చారు.
Ashif bhai.. we have fixed the surgery for next week in mumbai. Let’s get the little angel super fit. My team will connect with you regarding your travel details.
See u soon.❣️🙏 https://t.co/zrS4M1Ijj1— sonu sood (@SonuSood) September 1, 2020