త్వరలో టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తుంది : బాలకృష్ణ

-

అధికార పీఠంపై కూర్చొని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని నటుడు, హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. తెలిపారు.జెండా’ పేరుతో తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ…..’బ్రిటిష్ పాలకుల్లా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని విమర్శించారు. అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారు. రైతుల్ని ఈ ప్రభుత్వం మోసం చేసింది ధ్వజమెత్తారు.. కోడిగుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోంది అని ఎద్దేవ చేశారు.

త్వరలో టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తుంది’ అని తాడేపల్లిగూడెం సభలో బాల కృష్ణ ధీమా వ్యక్తం చేశారు.దివంగత సీఎం, తన తండ్రి ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారని ,రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలను అధికార పీఠం పైకి ఎక్కించారని గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తలే టీడీపీ బలమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ-జనసేన విజయం అత్యంత అవసరమని ఆయన అన్నారు .

Read more RELATED
Recommended to you

Latest news