Gaami : గామి కోసం యానిమల్ ను దింపుతున్న విశ్వక్ సేన్

-

విద్యాధర్‌ దర్శకత్వంలో మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గామి.ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. అభినయ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అప్పుడెప్పుడో అనౌన్స్ చేయబడిన ఈ చిత్రం నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం సమయానికి పూర్తి కాలేదు. దీంతో గత ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన గామి చిత్రం వాయిదా పడుతూ వచ్చింది.  ఎట్టకేలకు ఈ చిత్రం మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

ఇక అన్ని ట్రైలర్స్ లా కాకుండా ఈ చిత్రం ట్రైలర్ ను సరికొత్త ఫార్మాట్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . గామి షోరీల్ ట్రైలర్ పీసీఎక్స్ ఫార్మాట్‌లో విడుదల అవుతోందని చిత్ర బృందం పేర్కొంది.ప్రసాద్స్‌లోని పీసీఎక్స్ స్క్రీన్‌లో ఫిబ్రవరి 29న సాయంత్రం 4 గంటలకు ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నామని, ఈ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా అనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అనిమల్ మూవీ విడుదల దగ్గరనుంచి సందీప్ ఇంటర్వ్యూ, వ్యాఖ్యలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విశ్వక్ ఈవెంట్ కు సందీప్ వస్తే.. కొంత హైప్ రావడం గ్యారెంటీ అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news