బీసీసీఐ చైర్మెన్ గా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. టీమిండియా మెరుగ్గా రాణించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కోచ్ ఎంపిక తో పాటు సిబ్బంది ఎంపికల్లోనూ సౌవర్ గంగూలీ తనదైన శైలీతో వ్యవహరిస్తున్నాడు. దీంతో టీమిండియా మెరుగైన ఫలితాలు అందిస్తుంది. సౌరవ్ గంగూలీ సారథ్యంలో బీసీసీఐ క్రమ శిక్షణతో ఉందని పలువరు సీనియర్ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపంచారు.
అయితే ఇదీలా ఉండగా.. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ చూపు ఐసీపీ పీఠంపై పడిందని తెలుస్తుంది.ఐసీసీ చైర్మెన్ బాధ్యతలు చేపట్టడానికి సౌరవ్ గంగూలీ పావులు కదుపుతున్నట్టు సమాచారం. కాగ ప్రస్తుతం ఐసీసీ చైర్మెన్ గా ఉన్న గ్రెగ్ బార్క్ లే.. పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఐసీసీ చైర్మెన్ పదవీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఈ ఎన్నికల్లో సౌరవ్ గంగూలీ పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అయితే బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీతో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా ఐసీసీ చైర్మెన్ పీఠంపై కన్ను వేసినట్టు తెలుస్తుంది. 2023 లో భారత్ లో ప్రపంచ కప్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత్ నుంచే ఐసీసీ చైర్మెన్ ఉండాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.