కరోనా ఎఫెక్ట్ : హోం క్వారంటైన్‌లోకి వెళ్ళిన దాదా..!

-

బీసీసీఐ అధ్యక్షుడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కుటుంబంలో కరోనా‌ కలకలం సృష్టించింది. గంగూలీ సోదరుడు, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి స్నేహాశీష్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొద్దిరోజులు స్నేహాశీష్ జ్వరంతో బాధపడుతుండటంతో కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. స్నేహాశీష్‌ కు కరోనా సోకడంతో దాదా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. బెంగాల్‌ మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ అయిన స్నేహాశీష్‌ కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలడంతో బెల్లె వ్యూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

ఈ నెల 8న గంగూలీ తన 48వ పుట్టినరోజు వేడుకులు జరుపుకున్నాడు. ఆ వేడుకలకి స్నేహాశీష్‌ కూడా హాజరు కావడంతో గంగూలీతో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిస్క్‌ లో పడ్డారు. గంగూలీతో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ కనీసం 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version