దక్షిన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రలుతో కేంద్ర పాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ లతో నేడు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాన్ని ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి లో గల తాజ్ హోటల్ లో నిర్వ హించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. దాని కోసం శనివారం రాత్రి అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకున్నారు. అనంతరం అమిత్ షా తిరుపతి కి కూడా చేరుకుని శ్రీ వారిని దర్శనం చేసకున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి దక్షిణ భారత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు హాజరు కావాల్సి ఉంది. కాని ఈ సమావేశానికి ముగ్గురు ముఖ్య మంత్రులు డుమ్మ కొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ తో పాటు కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రి పినరయ్ విజయన్, తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ ఈ సమావేశానికి వెళ్లడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది.
అయితే తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ స్థానం హోం మంత్రి మహమ్మద్ అలీ తో పాటు సీఎస్ ఈ సమావేశానికి వెళ్తున్నట్టు తెలుస్తుంది. అలాగే కేరళ , తమిళనాడు ముఖ్య మంత్రులు ఈ సమావేశానికి వారి తరుపున మంత్రులను పంపిస్తున్నారా.. లేక ఈ సమావేశానికి పూర్తి గా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా.. అని తెలియాల్సి ఉంది.