ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నేడు మరణించిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆయన ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యం భారిన పడిన నేడు ప్రాణాలు విడిచారు. చెన్నైలో ఒక ప్రముఖ ఆస్పత్రిలో కన్ను మూసారు. రేపు సాయంత్రం ఎస్పీ బాలు అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తుంది అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
చెన్నై తిరువళ్లూరు జిల్లాలో రేపు బాలు అంత్యక్రియలు జరుగుతాయి. రెడ్ హిల్స్ సమీపంలోని తామరై పాకంలో ఎస్పీ బాలు అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. సా.4కి ఎంజీఎం నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్ ఇంటికి బాలు పార్థీవ దేహం తీసుకుని వెళ్తారు. అభిమానుల సందర్శనార్థం కోడంబాకంలో బాలు పార్థీవ దేహం ఉంచుతారు. ఇందుకోసం గాను అన్ని ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంత్యక్రియలకు తెలుగు రాష్ట్రాల సిఎంలు హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి కేసీఆర్, గన్నవరం నుంచి సిఎం జగన్ రేపు మధ్యాహ్నం అంత్యక్రియల స్థలానికి చేరుకుంటారు.