గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆగష్టు 5న కరోన కారణంగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఆయన కరోనా తగ్గినా బ్రెయిన్ హెమరేజ్ కారణంగా కన్ను మూశారు. అయితే ఆయన చనిపోయిన నాటి నుండి ఆయన చావుకు కారణం ఒక టీవీ చానల్ అని కొందరు, లేదు ఆసుపత్రి మంచి ట్రీట్మెంట్ ఇవ్వలేదని అందుకే ఆయన చనిపోయారని కొంత మంది ప్రచారం చేస్తున్నారు.
తాజాగా ఈ విషయం మీద ఎస్పీ చరణ్ ఒక కీలక ప్రకటన చేశారు. ఆసుపత్రిలో నాన్నగారి ట్రీట్మెంట్ కి సంబంధించి ఎలాంటి వివాదం లేదని, ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ కు సంబంధించి గానీ డబ్బుల పేమెంట్ కి సంబంధించి కానీ ఎలాంటి వివాదాలు లేవని ఆయన పేర్కొన్నారు. వివాదాలు ఉన్నాయని కొంత మంది ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆసుపత్రి మంచి చికిత్స అందించిందని, అసలు మాకు ఆసుపత్రి వాళ్ళకి ఎలాంటి వివాదమూ లేదని, దయచేసి ఇలాంటి ప్రచారం చేయకండని ఆయన కోరారు.