చిరంజీవి చేసిన పనికి ఎస్పీ ఫిదా..అసలు స్టోరీ ఇదే..

-

మెగాస్టార్ చిరంజీవి పేరు అంటే అందరికి యమ క్రేజ్..ఇక ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..మొన్నీమధ్య వచ్చిన ఆచార్య సినిమా హిట్ అవ్వలేదు..తాజాగా గాడ్ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఫస్ట్ షో నుంచే గాడ్ ఫాదర్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే గాడ్ ఫాదర్ టైటిల్స్ లో ఏపీ కి చెందిన ఓ పోలీస్ అధికారి పేరు కనిపించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాదు తన పేరు వెండితెరపై కనిపించడంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.

ఇంతకీ గాడ్ ఫాదర్ సినిమాలో వెండితెరపై కనిపించిన పోలీస్ అధికారి ఎవరో కాదు.. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప. ఫకీరప్పకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ టైటిల్ కార్డ్స్ వేశారు. దీంతో ఆయన పేరు ఎందుకు వేశారన్న డిస్కషన్ కూడా నడుస్తోంది. విషయానికొస్తే.. గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 28న అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగింది. భారీ స్థాయిలో జరిగిన ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. జోరువానలోనూ అభిమానులు మెగాస్టార్ కోసం వచ్చి ఈవెంట్ ను సక్సెస్ చేశారు. భారీ స్థాయిలో వచ్చిన అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అలాగే మెగా ఈవెంట్ కు సరైన భద్రత కల్పించారు..

ఆ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..పోలీసుల సహకారానికి, వర్షంలోనూ చూపించిన డెడికేషన్ కి పేరు పేరునా తన కృతజ్ఞతలు తెలిపారు. ఆ కృతజ్ఞత భావాన్ని మెగాస్టార్ చిరంజీవి అనంతపురంలోనే విడిచిపెట్టలేదు. తన హృదయానికి హత్తుకునేలా పోలీస్ శాఖ ఏర్పాట్లను చూసి మైమరచి పోయిన మెగాస్టార్.. స్క్రీన్ పై ఎస్పీ ఫక్కీరప్ప పేరును వేయించి కృతజ్ఞతలు తెలిపారు.ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news