మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ బస్సులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘోర ప్రమాదం లో 11 మంది సజీవ దహనం అయ్యారు. అలాగే ఏకంగా 35 మందికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహారాష్ట్ర నాసిక్ బస్సు ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోడీ.. ప్రమాదంలో చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల పరిహారాన్ని ప్రకటించారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోడీ