ఏపీలో ఇళ్ల పట్టాల పేరిట 4 లక్షలు కొట్టేసిన వాలంటీర్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నో అంచనాలతో ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ ఆయనను ఎప్పటికప్పుడు అపహాస్యం పాలు చేస్తూనే ఉంది. తాజాగా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ వాలంటీర్ ఏకంగా నాలుగు లక్షలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్తూరు టౌన్ నాలుగో డివిజన్ లో వాలంటీర్ లంచం తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ 37 మంది దగ్గర నుంచి ఏకంగా నాలుగు లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు అధికారులు.

ఎంతకూ ఇళ్ల పట్టాలు ఇవ్వక పోవడంతో స్థానికులు వాలంటీర్ ను నిలదీసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేయడం కోసం స్థానిక వైసీపీ నేత యత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం వాలంటీర్ పరారీలో ఉండగా అందుకు సహకరించిన అడ్మిన్ ను అధికారులు బదిలీ చేసినట్లు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వాలంటీర్ కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version