తెలంగాణలో కరోనా కాల్ సెంటర్.. ఎందుకో తెలుసా..!

-

కరోనా బాధితులకు ఎల్లప్పుడూ సేవలు అందించడానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కరోనాకు సంబంధించి ఏమైనా సూచనలు, సలహాలు తెలుసుకోవాలి అనుకునేవారు 1800 599 4455 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి తమ సందేహాలను నివృతి చేసుకోవచ్చు. హోం ఇసోలేషన్‌లో రోగితో పాటు రోగికి సేవలు అందించేవారు తీసుకోవలసిన జాగ్రతలపై సూచనలు చేయడం జరుగుతుంది.

కాగా, కాల్‌ సెంటర్‌ సిబ్బంది రెండు విడతల్లో సుమారు 200 మంది టెలీకాలర్స్‌ తో పని చేస్తోంది. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్న సుమారు 10 వేల మంది కోవిడ్‌ బాధితులను ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్‌ బాధితులు తీవ్రమైన శ్వాస సంబంధ సమస్య లేదా ఛాతినొప్పితో బాధపడుతుంటే వారి వివరాలను సేకరించి వెంటనే 108 ద్వారా మెరుగైన వైద్య సౌకర్యం కల్పించేందుకు ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news