తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఐటీ కారిడార్‌లో మహిళల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల కోసం ‘మెట్రో ఎక్స్‌ప్రెస్ లేడీస్ స్పెషల్’ బస్సును నేటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ బస్సు జేఎన్టీయూ నుంచి వేవ్ రాక్ వరకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నడవనుంది. నగర ఐటీ కంపెనీల్లో దాదాపు 5 లక్షల మంది వుమెన్ ఎంప్లాయ్స్ ఉన్నారు.
ఫస్ట్ బస్సు జేఎన్టీయూ నుంచి ఉదయం 9.05 గంటల నుంచి బయల్దేరి బస్సు నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి క్రాస్ రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వెళ్తుంది.సాయంత్రం 5.50 గంటలకు వేవ్ రాక్ నుంచి ఆయా మార్గాల ద్వారా జేఎన్టీయూకు చేరుకుంటుంది. ప్రయోగాత్మకంగా నడుపుతున్న ఈ సర్వీసు విజయవంతమైతే మరిన్ని మార్గాల్లో నడిపించాలని రోడ్డు రవాణా సంస్థ భావిస్తోంది. ఈ బస్సుల్ని మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ఆయన ట్విటర్ లో షేర్ చేశారు.