తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌.. దసరాకు ప్రత్యేక రైళ్లు

-

పండుగ సీజన్ వచ్చేసింది. ఇందులో దసరా, దీపావళి పండుగలు చాలా ప్రత్యేకం. కాగా.. వృత్తిరిత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్లంతా.. పండుగలకు సొంతూళ్లకు వెళ్లి సంబురాలు చేసుకోవాలని భావిస్తుంటారు. ఉపాధి కోసం వలస వెళ్లినవాళ్లు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవాళ్లు దసరాకు సొంతూరికి వెళ్లాలని ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తుంటారు.

SCR cancels 10 trains functioning from Hyderabad

అయితే, రద్దీ కారణంగా స్వస్థలాలకు వెళ్లేందుకు ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది. రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్లు నెల రోజుల ముందే అయిపోతుంటాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ స్పెషల్ రైళ్లను ప్రకటించింది. ఈ స్పెషల్ రైళ్లు అక్టోబరు 2 నుంచి నడుస్తాయని వెల్లడించింది.

ప్రత్యేక రైళ్ల వివరాలు…

ట్రైన్ నెం.08579: విశాఖపట్నం-సికింద్రాబాద్ (అక్టోబరు 4 నుంచి నవంబరు 29 వరకు ప్రతి బుధవారం) రాత్రి 7 గంటలకు విశాఖలో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరిక.
ట్రైన్ నెం.08580: సికింద్రాబాద్-విశాఖపట్నం (అక్టోబరు 5 నుంచి నవంబరు 30 వరకు)
ట్రైన్ నెం.03225: దానాపూర్-సికింద్రాబాద్ (అక్టోబరు 5 నుంచి డిసెంబరు 7 వరకు)
ట్రైన్ నెం.03226: సికింద్రాబాద్-దానాపూర్ (అక్టోబరు 5 నుంచి డిసెంబరు 7 వరకు)
ట్రైన్ నెం.03253: పాట్నా-సికింద్రాబాద్ (అక్టోబరు 2 నుంచి డిసెంబరు 2 వరకు ప్రతి సోమ, మంగళవారాల్లో)
ట్రైన్ నెం.07255: సికింద్రాబాద్-పాట్నా (అక్టోబరు 6 నుంచి డిసెంబరు 8 వరకు ప్రతి శుక్రవారం)
హైదరాబాద్-పాట్నా స్పెషల్ ట్రైన్- అక్టోబరు 4 నుంచి డిసెంబరు 6 వరకు ప్రతి బుధవారం

Read more RELATED
Recommended to you

Latest news