సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు
వెల్లడించారు. సికింద్రాబాద్ – కొల్లం స్టేషన్ల మధ్యలో ఈ నెల 20 నుంచి ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 17 వరకు శబరిమలకు ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. మొత్తంగా ఎనిమిది సర్వీసులుగా వీటిని కేటాయించారు. సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతినుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రైలు నెంబర్ 07117 సికింద్రాబాద్ నుంచి కొట్టాయంకు నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18, 25 తేదీలతో పాటు 2023 జనవరి 1, 8, 15 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి సోమవారం రాత్రి 9 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.
రైలు నెంబర్ 07118 కొట్టాయం నుంచి సికింద్రాబాద్‌కు నవంబర్ 22, 29, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు 2023 జనవరి 3, 10, 17 తేదీల్లో ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు మంగళవారం రాత్రి 11.20 గంటలకు కొట్టాయంలో బయల్దేరి బుధవారం అర్ధరాత్రి 1 గంటకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.