క్రికెట్ ఒక వికెట్ కోసం ఆటగాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఒక వికెట్ మ్యాచ్ ని మలుపు తిప్పేస్తూ ఉంటాయి. దీనితో వికెట్ పడగొట్టే విషయంలో కనీసం క్రీడా స్ఫూర్తి అనేది కూడా చాలా మంది ఆటగాళ్ళు ప్రదర్శించే అవకాశ౦ ఉండదు. వికెట్ కోసం ఎన్ని విమర్శలు వచ్చినా సరే క్రీడా స్ఫూర్తి అనేది చాలా మంది ఆటగాళ్ళు వెనక్కి తగ్గరు. కాని… ఒక ఆటగాడు మాత్రం గాయపడిన ఆటగాడిని రనౌట్ చేసే అవకాశం ఉన్నా సరే… అతను చేయకుండా తిరిగి ప్రత్యర్ధి ఆటగాడిని క్రీజులోకి ఆహ్వానించాడు.
శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఇసురు ఉడానా ఒక మజాన్సి సూపర్ లీగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది… పార్ల్ రాక్స్ తరఫున ఆడుతున్న ఇసురు ఉదనా 19 వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాటింగ్ జట్టుకు చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు అవసరం ఉంది. చివరి 8 బంతుల్లో 28 పరుగులు కావడంతో, హీనో కుహ్న్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను కొట్టిన బంతి వచ్చి మరైస్ ని తాకింది. దీనితో బంతి బలంగా తాకడంతో నాన్-స్ట్రైకర్ మైదానంలో పడిపోయాడు.
కాని 26 ఏళ్ళ ఉదానా… గాయపడిన బ్యాట్స్‌మన్‌ను తిరిగి క్రీజులోకి అనుమతించాడు. ఈ వీడియో ని ఉడానా ప్రదర్శించిన క్రీడా స్పూర్తిని “స్పిరిట్ ఆఫ్ క్రికెట్” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కీలక సమయంలో వికెట్ పడగొట్టే అవకాశం ఉన్నా సరే… పడగొట్టకుండా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించిన బౌలర్ పై ప్రసంశల వర్షం కురుస్తుంది. ఈ మ్యాచ్ ఈ నెల 8 న జరిగింది.
Spirit of cricket?
Raise your hand for more moments like this! Always! ?️?️?️?️#mslt20 pic.twitter.com/5nA8q9rQ2U
— Mzansi Super League ? ?? ? (@MSL_T20) December 8, 2019