ఆసియా కప్ లో భాగంగా ప్రస్తుతం సూపర్ 4 దశలో ఉన్నాము, ఈ దశలో ఇండియా , పాకిస్తాన్ , శ్రీలంక మరియు బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ఇక గ్రూప్ దశలో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కానీ ఇందులో పైచేయి మాత్రం పాకిస్తాన్ తో అని చెప్పాలి.. ఎందుకు ప్రతీకారంగా రేపు జరగనున్న సూపర్ 4 మ్యాచ్ లో అయినా తీర్చుకోవాలని ఇండియా ఎదురుచూస్తూ ఉంది. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుండగా… ఈ గ్రౌండ్ లో 90 శాతం వర్షం పడడానికి అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసే అభిమానులు నిరాశలో మునిగిపోయారు.
రేపు వర్షం పడి రద్దయినా.. ఎల్లుండికి రిజర్వ్ డే ఉంటుందని తెలుస్తోంది.. కానీ ఎల్లుండి కూడా వర్షం పడే ఛాన్స్ ఉన్నాయట. మరి ఏమి జరగనుంది అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.