సీన్ రివర్స్: 100 వ వన్ డే లో నిరాశపరిచిన బాబర్ ఆజామ్ !

-

గత రాత్రి న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఆఖరి వన్ డే లో గెలిచి టామ్ లాతమ్ సేన ఊపిరి పీల్చుకుంది. 5 మ్యాచ్ ల టీ 20 మరియు వన్ డే సిరీస్ ను ఆడడానికి వచ్చిన న్యూజిలాండ్ టీ 20 సిరీస్ ను డ్రా చేసుకోగా , వన్ డే సిరీస్ లో మాత్రం దారుణంగా విఫలం అయ్యి 1 – 4 తో పరువును దక్కించుకుంది అని చెప్పాలి. కాగా ఈ మ్యాచ్ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ కు 100 వది కావడం విశేషం. ఫార్మాట్ ఏదైనా 100వ మ్యాచ్ అంటే చాలా ప్రత్యేకమని చెప్పాలి. అందుకే పాకిస్తాన్ అభిమానులు అంత ఇతని ప్రదర్శన చూడడానికి తండోపతండాలుగా గ్రౌండ్ కు తరలి వచ్చారు.

 

కానీ బాబర్ ఆజామ్ మాత్రం అయిదు బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు చేసి సీప్లే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కాగా ఈ మ్యాచ్ లో న్యూజీలాండ్ చేతిలో 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆఖరి వరకు ఇఫ్తికార్ అహమ్మద్ 94 పరుగులు చేసి పోరాడినా ఉపయోగం లేకపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news