ఉప్పల్ స్టేడియంలో ఓ యువకుడు పోలీసుల కళ్ళు గప్పి టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్ళు మొక్కిన సంగతి తెలిసిందే. భారీ సెక్యూరిటీని ఛేదించుకొని మైదానంలోకి వెళ్లడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అతడు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన హర్షిత్ రెడ్డి(20)గా గుర్తించారు. అయితే.. హర్షిత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా కోర్టుకు హజరుపరిచారు. ఈ తరుణంలోనే.. హర్షిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.
కాగా, ఉప్పల్ స్టేడియంలో టీం ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 316 రన్స్ చేసి 126 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో యువ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీతో చెలరేగాడు. టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న పోప్ 208 బంతుల్లో 17 ఫోర్లతో 148 రన్స్ చేశాడు.