బిగ్ బ్రేకింగ్.. 2053 వరల్డ్ కప్ టీం మెంబర్స్ వీళ్లే.. అప్పుడు ఖచ్చితంగా కప్ మనదేనట..!

-

2053లో వరల్డ్ కప్ లో ఆడే ఇండియా టీమ్ ఇదేనని… 2053లో వీళ్లు ఖచ్చితంగా కప్ కొడుతారంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పిచ్చోళ్లా మీరు. 2023లో వచ్చే వరల్డ్ కప్ ఉంటే.. 2053 ని రాస్తారేంటి. కాస్త చూసుకోవాలి కదా రాసేటప్పుడు అని మామీద ఆడిపోసుకోకండి. ఎందుకంటే.. మేం రాసింది నిజమే 2053 వరల్డ్ కప్ గురించే ఇప్పుడు మాట్లాడేది. ఇంతకీ.. మీరు ఈ వార్తలోని ఫోటోను చూశారా? వాళ్లంతా ఎవరు అని అడగకండి. వాళ్లంతా మన టీమిండియా ఆటగాళ్లే. కాకపోతే.. 2053లో అలా అయిపోతారన్నమాట. ఏంటో ఏం అర్థం కావడం లేదంటారా? పదండి ఇంకాస్త లోతుకెళ్దాం.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే… ఫేస్ బుక్ లో కొత్తగా ఫేస్ యాప్ అని ఒకటి వచ్చింది లెండి. ఆ యాప్ విపరీతంగా పాపులర్ అయిపోయింది. ఎవ్వరు చూసినా.. తమ ఫోటోను 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారో.. 30 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారో చెక్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా తాము భవిష్యత్తులో ఎలా ఉంటామో చెక్ చేసుకుంటున్నారు.

వామ్మో.. ముసలి వాళ్లం అయితే ఇలా ఉంటామా? అని భయపడిపోతున్నారు. అదే యాప్ తో కొందరు నెటిజన్లు చిలిపిగా టీమిండియా క్రికెటరు 30 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటారో ఫోటోలను తీసుకొని.. 2053లో వరల్డ్ కప్ లో ఆడే ఇండియా టీమ్ ఇదేనని… 2053లో వీళ్లు ఖచ్చితంగా కప్ కొడుతారంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news